లవ్‌స్టోరి మూవీ రివ్యూః ప్రాణం లాగేస్తదబ్బా..!
కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు బావుంటే, మరికొన్ని సినిమాలు చూశాక కూడా బాగా అనిపిస్తాయి. ఇంకొన్ని సినిమాలు కొంతకాలం పాటు గుర్తుండిపోవడంతో పాటుగా, మనల్ని వెంటాడుతూంటాయి. నాగచైతన్య, సాయి పల్లవిల 'లవ్‌స్టోరి' కూడా ఆ కోవలోకే వస్తుంది. కాలాలు, కట్టుబాట్లు, గెలుపోటములు ఆవలి తీరంలో.. ఎప్పటికీ నిలిచేది, గెలిచేది ప్రేమ మాత్రమే అంటూ చాలా సెన్సిబుల్ గా శేఖర్ కమ్ముల చేసిన ప్రయత్నమే లవ్‌స్టోరి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత అందరూ మంచి సినిమా అవుతుందని హోప్స్ పెట్టుకున్న లవ్‌స్టోరి ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం. జుంబా డ్యాన్స్ సెంటర్ నడిపే నాగచైతన్యకు బీటెక్ చదివి ఉద్యోగం కోసం కష్టపడుతున్న మౌనిక పరిచయమవుతుంది. ఆ పరిచయంలో మెల్లిగా ప్రేమ చిగురించడం, ఆ ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు మధ్యలో కులం అనే అడ్డంకి రావడం.. ఈ కథంతా రొటీన్‌గానే అనిపించినప్పటికీ, శేఖర్ కమ్ముల దాన్ని తెర మీద ప్రెజెంట్ చేసిన విధానం ఒక విజువల్ వండర్ లా అనిపిస్తుంది. తెలంగాణ ప్రాంత బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథతో పాటుగా, కులాంతర వ్యవస...